వికటించిన సర్జరీ: 900,000 దిర్హామ్‌ల నష్టపరిహారం
- May 30, 2017
యు.ఏ.ఈ :హెర్నియా ఆపరేషన్ వికటించడంతో టెస్టికల్స్ కోల్పోయిన అరబ్ పేషెంట్‌కి 900,000 దిర్హామ్‌ల నష్టపరిహారం అందించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. అబుదాబీ ఫెడరల్ సుప్రీంకోర్టు, ఈ తీర్పునిచ్చింది. కింది కోర్టు, బాధితుడికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించగా, నష్టపరిహారాన్ని ఫెడరల్ సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. టెస్టీస్‌లో హెర్నియా సమస్యతో బాధపడుతున్న బాధితుడు, ఆసుపత్రిని ఆశ్రయించగా, ఆపరేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయకుండానే బాధితుడికి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కూడా నొప్పి తగ్గకపోవడంతో మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళగా, అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో టెస్టీస్‌లో సమస్య తీవ్రతరమయినట్లు గుర్తించారు. మరో ఆసుపత్రికి వెళ్ళి బాధితుడు, టెస్టీస్‌ని తొలగించుకున్నాడు. సెక్సువల్ ఫంక్షన్‌కి కూడా పనికిరాకుండా పోయిన బాధితుడు, ఈ నష్టానికి కారణం తనకు తొలుత శస్త్ర చికిత్స చేసిన వైద్యులేనని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







