అతివేగాన్ని అరికట్టేందుకు 30 స్మార్ట్ రాడార్లు
- May 31, 2017
షార్జా పోలీసులు ఎమిరేట్ వ్యాప్తంగా 30 కొత్త స్మార్ట్ రాడార్లను అమర్చారు. రోడ్లపై అతి వేగంతో వెళ్ళే వాహనాల్ని కనుగొనేందుకు ఈ స్మార్ట్ రాడార్ల వ్యవస్థ ఉపయోగపడ్తుంది. ఈ విషయాన్ని షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ అల్ జెరి అల్ షమ్షి చెప్పారు. అల్ ధైద్, మ్లీహా, ఎమిరేట్స్ అండ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్స్ సహా పలు రోడ్లపై వీటిని ఏర్పాటు చేశారు. స్పీడ్‌ని కనుగొనడమే కాకుండా, పలు రకాలపైన ఉల్లంఘనల్ని సైతం ఈ రాడార్లు గుర్తిస్తాయని అల్ షమ్షి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఉల్లంఘనలు చాలావరకు తగ్గుతాయని ఆశిస్తున్నట్లు వివరించారు. ఉల్లంఘనుల్ని గుర్తించి, భారీ జరీమానాలు విధించడం ద్వారా ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!







