ఇది సమయం కాదంటూ ఫ్యాన్స్‌ని వారించిన బన్నీ
- May 31, 2017
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సినీ ప్రముఖులంతా దాసరిని కడసారి చూసేందుకు తరలి వచ్చారు. అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ ను అభిమానులు చుట్టుముట్టారు. అల్లు అర్జున్ ను తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు వారంతా పోటీలు పడ్డారు. దీంతో బౌన్సర్లు అతనికి రక్షణ కల్పించారు. మరికొంతమంది అభిమానులు అల్లు అర్జున్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు ఇది సమయంకాదంటూ హితవు పలికాడు. ఆపేయాలని వారికి సూచించాడు. దీంతో అభిమానులు శాంతించారు. అనంతరం ఆయన దాసరి పార్థివదేహాన్ని సందర్శించి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







