అబుదాబీలో అగ్నిప్రమాదం: 16 షాపులు దగ్ధం
- October 09, 2015
అబుదాబీలోని బాని యాస్‌లోని మున్సిపాలిటీ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 16 షాపులు దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఆస్థి నష్టం మాత్రమే సంభవించింది, ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ దుకాణాలు, పలు ట్రేడ్ స్టోర్‌లు ఈ ప్రమాదంలో పూర్తిగా, పాక్షికంగా ధ్వంసమయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం గురించి తెలియగానే ఘటనా స్థలికి చేరుకుని, మంటల్ని ఆర్పివేశామని అబుదాబీ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి కెప్టెన్ అబ్దుల్లా హమాద్ అల్ తమిమి చెప్పారు. 8 టీమ్‌లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అగ్నిమాపక బృందానికి ప్రజలు అందించిన సహకారం చాలా గొప్పదని హమాద్ అల్ తమిమి వివరించారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి, ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







