అవినీతిపై కొత్త తరహా పోరాటం

- October 09, 2015 , by Maagulf
అవినీతిపై కొత్త తరహా పోరాటం

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక అకాడమీని అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు పార్లమెంటులో ప్రభుత్వం ఓ ప్రతిపాదనను ఉంచింది. ఆస్ట్రియాకి చెందిన ఈ అకాడమీ, అవినీతి వ్యతిరేకత ఉద్యమాన్ని పాఠ్యాంశంగా మార్చాలని సూచిస్తోంది. అవినీతిపై పోరుకు ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ని అందిస్తోంది. అవినీతిపై పరిశోధనలు చేయడం, అవినీతికి వ్యతిరేకంగా సమాజాన్ని ముందుకు నడిపించడం ఈ సంస్థ లక్ష్యాలు. అవినీతిపై పోరాటంలో అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కటై ముందుకు నడవాలని అకాడమీ సూచిస్తుంది. అవినీతి అనేది ఓ దేశానికి చెందిన సమస్య కాదని, ప్రపంచమంతా అవినీతిపై పోరాటం చేయవలసిన తరుణం ఆసన్నమైందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

 

--యం,వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com