షార్జాలో 30 ఇంటెల్లిజెంట్ రాడార్స్ ఏర్పాటు
- May 31, 2017
షార్జా పోలీసులు, ఇంటర్నల్ మరియు ఎక్సటర్నల్ రోడ్లపై 30 ఇంటెల్లిజెంట్ రాడార్స్‌ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2021 నేషనల్ ఎజెండాలో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని మరింత పటిష్టపరిచే క్రమంలో ఈ రాడార్స్ ఏర్పాటు జరిగింది. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ మొహమ్మద్ అల్ జిరి అల్ షమ్షి మాట్లాడుతూ, ఎమిరేట్ వ్యాప్తంగా ఇంటెల్లిజెంట్ రాడార్స్‌ని 30 వారాల పాటు ఏర్పాటు చేశామని అన్నారు. అల్ ధైద్ రోడ్, మలిహా స్ట్రీట్, ఎమిరేట్స్ రోడ్, మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ సహా పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. స్పీడ్ లిమిట్‌తోపాటుగా హెవీ లోడింగ్ వెహికిల్స్, మినిమమ్ స్పీడ్ లిమిట్ కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలు, టెయిల్ గేటింగ్ వంటి ఉల్లంఘనల్ని ఈ రాడార్లు గుర్తుపడతాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







