హీరో బాలయ్య సలహాతో ఛార్మి ఔట్
- May 31, 2017
బాలకృష్ణ- శ్రియ జంటగా రానుంది ఓ ఫిల్మ్. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోర్చుగల్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణపై యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇందులో ఐటమ్ బ్యూటీ ఛార్మీని తీసుకోవాలని యూనిట్ ప్లాన్ చేసినప్పటికీ, చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయ్యింది. ఆమె ప్లేస్‌లోకి కైరాదత్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
బాలీవుడ్ డైరెక్టర్ మధూర్ బండార్కర్ తెరకెక్కించిన 'క్యాలెండర్ గర్ల్స్' ఫిల్మ్‌లో ప్రధాన పాత్రలో నటించింది కైరాదత్. స్పెషల్‌సాంగ్ అనగానే కొత్త బ్యూటీ అయితే బాగుంటుందని ఆలోచన పూరీ చేయడం, ఆమెని అప్రోచ్ కావడం అంతా జరిగినట్టు ఇన్సైడ్ సమాచారం.
ఛార్మి కంటే కొత్త బ్యూటీ అయితే బాగుంటుందని బాలకృష్ణ సలహా ఇవ్వడంతో కైరాని ఎంపిక చేసినట్టు యూనిట్ చెబుతున్నమాట. 40 రోజులపాటు కీలక సన్నివేశాలు, పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేయనున్నాడు డైరెక్టర్. ఎప్పుడూ తన సినిమాలకు స్పెయిన్‌ని ఎంపిక చేసుకునే పూరీ, ఈసారి పోర్చుగల్‌కి షిఫ్ట్ అయ్యాడు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







