తైవాన్ విమాన ప్రమాదంలోనే నేతాజీ చనిపోయారని నిర్ధారణ చేసిన ప్రధాని మోడీ
- May 31, 2017
నేతాజీ సుభాష్ చంద్రబోస్.. చనిపోయారా, ఇంకా బతికున్నారా.. ఎప్పట్నుంచో మిస్టరీగా మిలిగిన ప్రశ్న ఇది. కానీ ఇన్నాళ్లకు కేంద్రం దీనిపై ఒక క్లారిటీ ఇచ్చింది. ,షానవాజ్, జస్టిష్ జీడీ ఖోస్లా కమిషన్ల నివేదికను బట్టి.. బోస్ తైవాన్ విమాన ప్రమాదంలో మరణించారని నిర్ధారించింది. ఆర్టీఐ ద్వారా వచ్చిన దరఖాస్తుకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేతాజీ మిస్సింగ్ మిస్టరీకి తెరదించింది.
ఇన్నాళ్లూ మిస్టరీగా నిలిచిన నేతాజీ మిస్సింగ్ అంశంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సుభాష్ చంద్రబోస్ తైవాన్ విమాన ప్రమాదంలోనే చనిపోయారని నిర్ధారించింది. ఆయన మరణంపై వ్యక్తమవుతున్న అనుమానాలకు తెరదించుతూ కీలక ప్రకటన చేసింది. 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ ప్రాణాలు కోల్పోవడం నిజమేనని తేల్చింది. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్, జస్టిస్ ముఖర్జీ కమిషన్ నివేదికల ఆధారంగా భారత సర్కారు దీనిపై నిర్ధారణకు వచ్చింది. చట్టం కింద ఓ వ్యక్తి దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతాజీ తైవాన్ విమాన ప్రమాదంలోనే మరణించినట్లు తెలిపింది. బోస్ మృతికి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని ఇప్పటికే డీక్లాసిపై చేసిన హోంశాఖ ఆ విషయాన్ని వివరంగా చెప్పింది. దీనిపై నేతాజీ కుటుంబం కూడా ఎప్పట్నుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బలమైన ఆధారాలు లేకుండా విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని ఎలా అనుకోవాలని ఆయన బంధువులు ప్రశ్నిస్తూ వచ్చారు. దీనిపై మోడీని కూడా కలవాలనుకున్నారు. కానీ కేంద్రం ప్రకటనతో వీరి వాదనకు ఇక తెరపడినట్టే. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోస్ మరణంపై గతంలో ఎప్పుడూ లేనంత చర్చ జరిగింది. 2015లో మోడీని నేతాజీ కుటుంబ సభ్యులు కలిసి, బోస్ మృతిపై 70 ఏళ్ల పాటు నెలకొన్న మిస్టరీని చేధించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో గత ఏడాది నేతాజీకి సంబంధించిన 100 రహస్య పత్రాలను మోడీ విడతల వారీగా బహిర్గతం చేశారు. షానవాజ్ కమిటీ, జస్టిస్ జీడీ ఖోస్లా కమిషన్ తైవాన్ ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు నివేదికలిచ్చాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







