ఫ్రెంచ్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే సానియా మీర్జా జోడీ ఓటమి
- May 31, 2017
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత టెన్నిస్ అభిమానులు బుధవారం మిశ్రమ ఫలితాలను చవిచూశారు. కొత్త భాగస్వామి కజకస్థానీకి చెందిన యారోస్లావా ష్వెదోవాతో కలిసి తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది.
ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ జోడీ అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)-అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-ష్వెదోవా జోడీ 6-7 (5/7), 6-1, 2-6 తేడాతో ఓటమి పాలైంది.
సుమారు 2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. ఇక పురుషుల డబుల్స్‌లో భారత స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న తమ వేర్వేరు భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు.
తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన రోహన్ బోపన్న-క్యువాస్ (ఉరుగ్వే) జోడీ 6-1, 6-1తో మథియాస్ బుర్‌గ్యూ-పాల్ హెన్రీ మథియు (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. ఇక లియాండర్ పేస్-స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) జంట 7-6 (7/5), 4-6, 6-2తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)-అల్బోట్ (మాల్డోవా) ద్వయంపై గెలిచింది.
మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సానియా మిర్జా క్రోయేసియాకు చెందిన ఇవాన్ డోడిజ్‌తో కలిసి ఆడనుంది. గతేడాది ఈ జోడీ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







