ప్లాస్టిక్ రైస్ రూమర్స్‌ని కొట్టిపారేసిన దుబాయ్ మునిసిపాలిటీ
- May 31, 2017
సోషల్ మీడియాలో, ప్లాస్టిక్ రైస్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని దుబాయ్ మునిసిపాలిటీ ఖండించింది. దుబాయ్ మార్కెట్‌లలో ప్లాస్టిక్ రైస్ లభ్యమవుతున్నాయనీ, ప్లాస్టిక్ రైస్ ఆరోగ్యానికి ఎంతో హానికరమని సోషల్ మీడియాలో ఓ రూమర్ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై దుబాయ్ మునిసిపాలిటీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఇమాన్ అల్ బస్తకి స్పందించారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అల్ బస్తకి స్పష్టం చేశారు. దుబాయ్ మార్కెట్లలో లభ్యమయ్యే రైస్ పూర్తిగా సురక్షితమని తెలియజేశారు. ప్లాస్టిక్ రైస్‌ని కనుగొనడం తేలిక గనుక ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని, నిజంగానే ఎవరి దృష్టికి అయినా ప్లాస్టిక్ రైస్ వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించేందుకు అధికార బృందాలు సిద్ధంగా ఉన్నాయని, కాబట్టి మార్కెట్‌లో ప్లాస్టిక్ రైస్ ఆనవాళ్ళు దొరికే అవకాశం లేదని అల్ బస్తకి చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్‌లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







