హౌసింగ్ మినిస్ట్రీతో మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ ఎంఓయూ
- May 31, 2017
మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ని హౌసింగ్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా సందర్శించారు. మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ మరియు మెడికల్ సెంటర్ - హౌసింగ్ మినిస్ట్రీ మధ్య ఎంఓయూలో బాగంగా ఈ పర్యటన సాగింది. మినిస్ట్రీకి చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య చికిత్సల్లో ప్రత్యేక డిస్కౌంట్‌కి సంబంధించిన ఎంఓయూ ఇరు వర్గాల మధ్యా కుదిరింది. అండర్ సెక్రెటరీతోపాటుగా హౌసింగ్ మినిస్ట్రీ డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఫైనాన్షియల్ డైరెక్టరేట్ షేక్ మొహమ్మద్ బిన్ ఇబ్రహీమ్ అల్ ఖలీఫా మరియు హౌసింగ్ మినిస్ట్రీ చీఫ్ ఆఫ్ పిఆర్ అండ్ మీడియా హైతమ్ కమాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రి అంతటా వీరు సందర్శించి, ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి వాకబు చేశారు. బహ్రెయిన్‌లో ఓపెన్ ఎంఆర్ఐ మెషీన్‌ని కలిగి ఉన్న అతి కొద్ది హాస్పిటల్లో మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ ఒకటి. భవిష్యత్తులో బహ్రెయిన్ వైద్య రంగంలో మిడిల్ ఈస్ట్ హాస్పిటల్ మరిన్ని అద్భుతాలు సాధిస్తుందని అండర్ సెక్రెటరీ ఆశాభావం వ్యక్తం చేశారు. మిడిల్ ఈస్ట్ గ్రూప్ ఛైర్మన్ వర్గీస్ కురియన్ మాట్లాడుతూ, అందుబాటులోకి వస్తున్న సరికొత్త వైద్య విధానాల్ని అందిపుచ్చుకుని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







