అభిమానుల ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 75వ జన్మ దినోత్సవ వేడుకలు
- June 01, 2017
పద్మభూషణ్, సూపర్ స్టార్, నటశేఖర, డాక్టర్ హీరో కృష్ణ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా కృష్ణ జిల్లా (విజయవాడ) కృష్ణలంక, కృష్ణ టీ స్టాల్ నిర్వాహకుడు లొల్ల కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో నల్లగేటు శంకర్ మఠం లో కప్పగంతుల సూర్య నారాయణ పంతులు గారి సారధ్యం లో వేద పండితులు హీరో కృష్ణ గారి ఆరోగ్య వంతులు గా నిండు నూరేళ్లు జీవించాలని ఆయుష్షు హోమం నిర్వహించారు. ఈ సందర్భం గా స్థానిక 22వ వార్డ్ వై. ఎస్. ఆర్. సి. పి కార్పొరేటర్ పల్లెం రవి, 23వ వార్డ్ టి.డి.పి కార్పొరేటర్ వి. నరసింహం ముఖ్య అతిధులు గా పాల్గొని సినీ నటుల అభిమానులు అలంకారాలకు పోకుండా సామజిక సేవ కార్యక్రమాలు నిర్వహించటం ఎంతో సంతోషకరమైనదని లొల్ల కృష్ణ మోహన్ ని అభినందించారు. ఈ కార్యక్రమం లో దొంతరాజు బాబు రావు, వల్లభనేని రవి, బాబ్జి, మాగంటి భువన్, శీరం బుజ్జి, సయ్యద్ సాహుల్, ఈ. వెంకటేశ్వరులు (చిన్నా), ముఠా గంగాధర్, మాజీ కార్పొరేటర్ మాల కొండయ్య, ఒడుగు సురేష్, పాల్గొని ఆనందం వ్యక్తం చేసారు.
పద్మభూషణ్, సూపర్ స్టార్, నటశేఖర, డాక్టర్ హీరో కృష్ణ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా గుంటూరు చాకలి గుంట, గాంధీ నగర్ అంబెడ్కర్ ఎలిమెంటరీ స్కూల్ లో దాసరి వెంకట రావు ఆద్వర్యం లో హీరో కృష్ణ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి పిల్లలకు పలకలు పుస్తకాలు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో నరసాల కొండల రావు, సత్తెనపల్లె నరసింహారావు, దార్ల కన్నా, యడల చిన్న, డి. మాల్యాద్రి, యస్. నాని, పాపిరెడ్డి, జిలాని, తదితర అభిమానులు పాల్గొన్నారు.
పద్మభూషణ్, సూపర్ స్టార్, నటశేఖర, డాక్టర్ హీరో కృష్ణ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా విజయవాడ హనుమాన్ పేట లోని దుర్గ కళా మందిర్ సమీపం లోని యస్.కే.సి.వ్ చిల్డ్రన్స్ ట్రస్ట్ లో A1 స్టార్ కృష్ణ మహేష్ యూత్ ఫోర్స్ వి. యల్. రెడ్డి మరియు చంటి ఆద్వర్యం లో కేక్ కట్ చేసి 60 మంది పిల్లలకు భోజన వసతి ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో శివ, సూర్య, కృష్ణ, నాగేశ్వర్ రావు, ప్రసాద్, తదితర అభిమానులు పాల్గొన్నారు.
పద్మభూషణ్, సూపర్ స్టార్, నటశేఖర, డాక్టర్ హీరో కృష్ణ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్ సమీపం లో ని రైల్వే స్కూల్ నవ జీవం భావం లో శీరం బుజ్జి ఆద్వర్యం లో 150 మంది పిల్లలకు స్వీట్స్ పంచి భోజన వసతి ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఇద్దరు విద్యార్థులకు చైతన్య స్కూల్ లో ఫీజు నిమిత్తమై 35000/- ను అందజేశారు. అలంకార సెంటర్ లో ప్రజలకు మజ్జిగ రస్నా ప్యాకెట్ ల ను పంచి స్వరాజ్ మైదానం లో అభిమానులు సమావేశం అయ్యి కేక్ కట్ చేసి తమ అభిమాన హీరో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో గుడివాడ జమదగ్ని, లొల్ల కృష్ణ మోహన్, ముఠా గంగాధర్, దుర్గ, నాని తదితర అభిమానులు పాల్గొన్నారు.
పద్మభూషణ్, సూపర్ స్టార్, నటశేఖర, డాక్టర్ హీరో కృష్ణ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా వైజాగ్ లోని దసపల్లా స్టార్ హోటల్ లో సీనియర్ అభిమాని భావినేని సురేష్ ఆద్వర్యం లో, అభిమానుల సమక్షం లో అత్యంత ఆహ్లాదకరంగా భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి, తమ అభిమాన హీరో ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమం లో చిరుకూరి శ్రీనివాస్, విజయనగరం నాగేశ్వర్ రావు, భాస్కర్, గల్లా శ్రీనివాస్, రామ కృష్ణ, అనిల్, బాల రామ రాజు, బి. శ్రీనివాస్, వేగి దుర్గ రావు, తదితర అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







