బ్రెజిల్‌లో వింత ఘటన: బైక్‌పై శవాన్ని ఊరేగించి!.. చూసినోళ్లంతా షాక్
- June 01, 2017
రక్త సంబంధీకులెవరైనా హఠాత్తుగా చనిపోతే తట్టుకోవడం చాలా కష్టం. ఏళ్లుగా పెనవేసుకున్న బంధాన్ని ఒక్కసారిగా తెంచేసుకోవాలంటే మనసు ఎంతమాత్రం ఒప్పుకోదు. అలా అని విధి ముందు తలవంచక తప్పదు. దు:ఖాన్ని దిగమింగకుని పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడమే తప్పితే.. అంతకుమించి చేసేదేమి ఉండదు.
కానీ బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి విచిత్రంగా వ్యవహరించాడు. చనిపోయిన సోదరుడిని మరిచిపోలేక ఏకంగా అతని సమాధిని తవ్వి శవపేటికను బయటకు తీశాడు. ఆపై బైక్‌పై ఎక్కించుకుని ఊరేగించాడు. రోసా అనే ఓ వ్యక్తి చేసిన ఈ పనికి ఊరంతా ముక్కున వేలేసుకున్నారు. ఇదే విషయం పోలీసులు చెవిన పడటంతో తమ వాహనాల్లో అతని బైక్ ను వెంబడించి పట్టుకున్నారు.
తన సోదరుడిని మరిచిపోలేకే ఇలా చేయాల్సి వచ్చిందని రోసా చెప్పాడు. అదీగాక, ఓరోజు కలలో కనిపించి బైక్ పై తిరగాలని ఉందంటూ తన సోదరుడు కోరాడని తెలిపాడు. అందువల్లే సమాధిని తవ్వి తన సోదరుడి శవపేటికను బైక్ పై ఊరేగించానని చెప్పుకొచ్చాడు. పోలీసులు రోసాపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
కాగా, శవపేటికను బైక్ పై ఊరేగిస్తున్న సమయంలో కొంతమంది ఫోటోలు కూడా తీశారు. అవి కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







