స్పిట్టింగ్, స్టీలింగ్: ఇద్దరి అరెస్ట్
- June 01, 2017
షార్జా: షార్జా పోలీసులు ఇద్దరు ఇథియోపియన్ జాతీయుల్ని అరెస్ట్ చేశారు. కొత్త పద్ధతుల్లో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు క్లయింట్స్‌ని గుర్తించి, వారిపై ఉమ్మివేసి వారి దృష్టిని మళ్ళించి దొంగతనాలు చేయడం వీరి ట్రిక్. వారే ఉమ్మివేసి, అవతలి వ్యక్తి షర్ట్ పాడయ్యిందంటూ సారీ చెప్పి, తుడిచేందుకు ప్రయత్నించడం, ఇంకో వ్యక్తి క్షణకాలంలో దొంగతనం చేసి అక్కడినుంచి పారిపోవడం ఈ గ్యాంగ్ దొంగతనాల నైజం. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వ్యూహాత్మకంగా నిందితుల్ని పట్టుకోగలిగారు. నిందితులు నేరం అంగీకరించగా, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి పోలీసులు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







