యూట్యూబ్ లో సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' రికార్డ్ ను బీట్ చేసిన అల్లుఅర్జున్ 'సరైనోడు'
- June 02, 2017
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. డ్యాషింగ్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ నటించిన సరైనోడు హిందీ వెర్షన్ కు బీటౌన్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఇటీవలే సరైనోడు హిందీ వెర్షన్ ను సోనీ మ్యాక్స్ ఛాన్ ల్ లో టెలికాస్ట్ చేసి అదే రోజున, య్యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వెంటనే ఈ సినిమాకు కేవలం 24 గంటల్లో 6.1 మిలియన్ వ్యూస్ 4 రోజుల్లో 16 మిలియన్ వ్యూస్ రావడమే కాకుండా, బాలీవుడ్ కండలవీరుడు సల్లూభాయ్ అప్ కమింగ్ మూవీ ట్యూబ్ లైట్ క్రియేట్ చేసిన రికార్డుల్ని బద్దలుకొట్టింది. ఇంతవరకు య్యూట్యూబ్ లో ఏ భారతీయ సినిమా నమోదుచేయని రికార్డుల్ని సరైనోడు క్రియేట్ చేయడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. య్యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించుకోవడమే కాకుండా, అస్ట్రేలియా, బెహరీన్, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో నెంబర్ వన్ పోజిషన్ లో సరైనోడు ట్రెండ్ అవుతుండటం విశేషం. మూడు రోజులుగా నెంబర్ వన్ గానే కొనసాగుతున్నాడు సరైనోడు. అలానే ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 లిస్ట్ లో సరైనోడు చోటు దక్కించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ గత సినిమా సన్నాఫ్ సత్యమూర్తి హిందీ వెర్షన్ కూడా 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా స్టైలిష్ స్టార్ దూసుకుపోతుండటంతో మెగా అభిమానుల్లో పండగ వాతవరణం నెలకొంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







