రష్యా పర్యటనలో ప్రధాని మోడీ బిజీ బిజీ...
- June 01, 2017
నాలుగు దేశాల పర్యటనలో భాగంగా రష్యా సాంస్కృతిక రాజధాని పీటర్స్ బర్గ్‌లో ప్రధాని మోడీ బిజీ బిజీగా గడిపారు. నగరంలో ఉన్న పిస్కరెవ్ స్కోయె స్మారకం దగ్గర రెండో ప్రపంచ యుద్ధ బాధితులకు నివాళులు అర్పించారు. లెనిన్ గ్రాడ్ ముట్టడి సమయంలో అమరులైన 5 లక్షల మంది రష్యన్ల సమాధులు ఇక్కడున్నాయి. మోడీ రెండు నిమిషాల పాటు వీరందరికీ శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై వీరిద్దరూ చర్చించారు. రష్యా, భారత్ బంధంతో ప్రయోజనాలతోపాటూ వారి ఆనందం కూడా తమకు ముఖ్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సంబంధాలు సహజంగా పెరుగుతాయి, దిగజారుతాయని అయితే రష్యా, భారత్ మధ్య ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. రష్యా, భారత్ మధ్య ఉన్న ప్రత్యేకమైన నమ్మకం, స్నేహం వల్ల రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయని పుతిన్ అన్నారు.
రష్యాలో మోడీ పర్యటన ఇవాళ కూడా కొనసాగనుంది. రెండు దేశాల దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవానికి ప్రధాని హాజరవుతారు. దీనితోపాటూ రష్యా వార్షిక సదస్సులో కూడా పాల్గొంటారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా 30 బిలియన్లను చేర్చే దిశగా రెండు దేశాల వ్యాపార వేత్తలతో సమావేశం అవుతారు. మోడీ రష్యా పర్యటనలో ఇది కీలక ఒప్పందం కానుంది. ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి సెయింట్ పీటర్స్ బర్గ్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగిస్తారు. రష్యా పర్యటన తర్వాత ఇవాళ ప్రధాని టూర్‌లో చివరి దేశమైన ఫ్రాన్స్ బయలుదేరుతారు. రేపు ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడు ఇమ్మాన్యువెల్ మాక్రోన్ తో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ రిఫార్మ్స్, భారత శాశ్వత సభ్యత్వం, వాతారవణ మార్పులు తదితర అంశాలపై చర్చిస్తారు. ప్రాన్స్ పర్యటన ముగియగానే.. అక్కడి నుంచి ప్రధాని నేరుగా భారత్ చేరుకుంటారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







