140 చోట్ల ఎముకలు విరిగినా ప్రపంచాన్ని తన సంగీతంతో ఉర్రితాలు ఊగిస్తున్న స్పర్ష్ షా
- June 02, 2017
పుట్టుకతోనే 35 చోట్ల ఎముకలు విరిగి జన్మించిన స్పర్ష్ షా తన సంగీతంతో ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయాడు. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న భారత సంతతి దంపతులకు చెందిన ఈ బాలుడు అందరినుంచి ప్రశంశలు అందుకుంటున్నాడు. స్పర్ష్ షా ఆస్టియోజెనెసిస్ ఇంపర్ ఫెక్టా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతడు పుట్టుకతోనే 35 చోట్ల ఎముకలు విరిగి జన్మించాడు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తనకు ఇష్టమైన పాటలను పాడుతూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్నాడు. పాటలు అలరిస్తుంటే మాటలు స్ఫూర్తిని నింపుతున్నాయి. నాట్ అఫ్రైడ్ అంటూ 2016లో ఆ బాలుడు విడుదల చేసిన వీడియో ఆల్బమ్ వైరల్ అయ్యింది. దాదాపు ఆరు కోట్ల మంది దీనిని వీక్షించారు. రాగ ర్యాప్ అనే సరికొత్త బాణిని స్పర్ష్షా సృష్టించాడు. ఇప్పటి వరకు అనేక సంగీత కచేరీలు ఇచ్చిన ఆ బాలుడు 50లక్షల డాలర్లను సంపాదించాడు. వాటితో వైద్యం చేయించుకుంటూ సంగీత సాధన సాగిస్తున్నాడు. గత డిసెంబరులో ముంబై వచ్చిన స్పర్ష్ షా ఓ టీవీ షోలో మాట్లాడుతూ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ లేదని, కాకపోతే తపన ఉండాలని అన్నాడు. వందకోట్ల మంది ప్రదర్శన ఇవ్వాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నాడు. అమెరికా, భారత సంగీతాన్ని అవపోసాన పట్టిన స్పర్ష్ షా తన పేరును ప్యూరిథమ్గా మార్చుకున్నాడు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







