గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో అత్తాకోడళ్ళైన దేవసేన అవంతికలు ఒకే స్క్రీన్ పై
- June 02, 2017
టాలీవుడ్ లో హీరోయిన్ లుగా అడుగు పెట్టిన అనుష్క, తమన్నాలు పదేళ్ళకు పైగా అయ్యింది.. వీరిద్దరూ బాహుబలి సినిమాలో దేవసేన, అవంతిక పాత్రల్లో నటించి మెప్పించారు.. ఈ సినిమా వీరిద్దరికీ ఎంతో మంచి పేరు తెచ్చింది.. కాగా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈ అత్తాకోడళ్ళు ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. వివరాల్లోకి వెళ్తే..
స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్ నాలుగు భాషల్లో ఓ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాల్లో ఉన్నాడు.. ఎడ్వెంచర్ నేపద్య కథ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఒక హీరోగా తెలుగు నుంచి సాయి ధరం తేజ్ ను కానీ చైతు ను కానీ ఎంచుకొనున్నాడట.. కాగా మిగతా పాత్రల్లో జయం రవి, పృధ్వీరాజ్, సాయి ప్రణీత్ రాజ్ కుమార్, ను ఎంచుకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో అనుష్క, తమన్నా లు నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.. ఒక పెళ్లి వేడుకకు వచ్చిన నలుగురు కుర్రాళ్ళు అక్కడనుంచి అడ్వెంచర్ ట్రిప్ కి వెళతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏంచేస్తారన్నకాన్సెప్ట్ పై ఈ సినిమా తెరకెక్కనున్నట్లు.. త్వరలో అధికారిక ప్రకటన వెలువదనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్









