మళ్లీ బుల్లితెరపై అలరించనున్న అమితాబ్
- June 02, 2017
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో బుల్లితెరపై తనదైన ముద్రవేశారు అమితాబ్. విశేష ప్రేక్షకాదరణ చూరగొన్న ఈ కార్యక్రమం ద్వారానే మరోసారి అలరించేందుకు బిగ్ బీ సిద్ధమయ్యారు. 9వ సీజన్ ఆగస్టు- సెప్టెంబర్ మాసాల్లో ప్రారంభం కానుందని, మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఆయన తన వ్యక్తిగత బ్లాగ్‌లో అభిమానులతో పంచుకున్నారు. అమితాబ్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ఏడు సార్లు వ్యాఖ్యాతగా వ్యవహరించి అభిమానుల ఆదరాభిమానాలు పొందారు. ఈ షో ద్వారా అమితాబ్ తన జీవిత అనుభవాలను అభిమానులతో పంచుకునేవారు. ఒక్క 3వ సెషన్‌లో మాత్రమే ఈ ‘పింక్‌స్టార్’ పాల్గొనలేకపోయారు. అప్పటి షోకు షారూఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే, మళ్లీ తాజాగా అమితాబ్ ఈ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం అభిమానులకు తీపికబురే మరి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







