వెకేషన్‌కి వెళ్ళేటప్పుడు దొంగలతో జాగ్రత్త
- June 02, 2017
అపార్ట్‌మెంట్లలో దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వెకేషన్ కోసం టెనెంట్స్ ఇతర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కువైట్‌లో నివసిస్తున్న వలసదారులు ఈ దొంగతనాలతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కువమంది భారతీయులు నివసించే అబ్బాస్సియా ప్రాంతంలో ఇటీవల ఓ దదంగతనం జరిగింది. ఆ దొంగతనంతో ఓ భారతీయ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. వెకేషన్ నుంచి తిరిగివచ్చిన ఆ కుటుంబానికి తమ ఇంట్లో జరిగిన దొంగతనం తీవ్ర వేదనను మిగిల్చింది. బాత్రూమ్‌లోని ఫ్రెష్ ఎయిర్ ఫ్యాన్‌ని తొలగించి, ఆ మార్గం ద్వారా దొంగలు తమ ఇంట్లోకి ప్రవేశించినట్లు బాధిత కుటుంబం గుర్తించింది. ఇంట్లో విలువైన వస్తువుల్ని ఉంచకపోవడం, అలాగే వెకేషన్‌కి వెళ్ళేవారు పోలీసులకు తగిన సమాచారం ఇవ్వడం మంచిదని అధికారులు ఈ దొంగతనాల నేపథ్యంలో సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







