జూన్ మొదటివారం లో "ఇంతలోఎన్నెన్ని వింతలో"టీజర్
- June 02, 2017
హరి హర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు హీరోగా, సౌమ్య హీరోయిన్‌గా, స్వామిరారా ఫేమ్ పూజా రామచంద్రన్ కీలక పాత్రలోనూతన దర్శకుడు వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో సామంతుల శ్రీకాంత్ రెడ్డి , ఇప్పిలి రామ మోహన రావు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న నూతన చిత్రం "ఇంతలోఎన్నెన్ని వింతలో". దర్శకుడు మాట్లాడుతూ హీరో, ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకొనే తరుణంలో స్నేహితుడు చేసిన చిన్న పొరపాటు ఎటువంటి పరిణామాలకు దారితీసిందో అన్న పాయింట్ ను అత్యంత ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన చిత్రం "ఇంతలోఎన్నెన్ని వింతలో". నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈచిత్రం టీజర్ ను జూన్ మొదటి వారంలో ప్రముఖ హీరో చేతుల మీదుగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రానికి కెమెరా: ఎస్ మురళి మోహన్ రెడ్డి, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఆర్ట్: జిల్లా మోహన్, సాహిత్యం: సురేష్ ఉపాధ్యాయ, సంగీతం: యాజమాన్య, సహ నిర్మాత: డి.శ్రీనివాస్ ఓంకార్, నిర్మాతలు: సామంతుల శ్రీకాంత్ రెడ్డి , ఇప్పిలి రామ మోహన రావు,దర్శకత్వం: వర ప్రసాద్ వరికూటి.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







