తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ
- June 03, 2017
రామ్‌గోపాల్ వర్మ.. సంచలనాలకు మారు పేరు. ఒకప్పుడు మంచి సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న వర్మ.. ఇప్పుడు వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించారు. ట్విట్టర్ వేదికగా ఎంతో మంది ప్రముఖులపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన వర్మ ఇటీవలే ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. ట్విట్టర్‌ను బయటకు రావడమే తరువాయి.. 'గన్స్ అండ్ థైస్' అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. అయితే వర్మ తాజాగా ఇప్పుడు సన్నీలియోన్‌ను సపోర్ట్ చేస్తూ 'మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తి హై' పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్‌ను రిలీజ్ చేశారు. తన మొదటి షార్ట్ ఫిల్మ్ ఇదేనంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు వర్మ. సన్నీలియోన్‌లా అవ్వాలనుకుంటున్న ఓ యువతిని, ఆమె తల్లిదండ్రులు మందలిస్తారు. దీంతో ఆ యువతి వాళ్లకు దీటుగా జవాబిస్తుంది. తాను సన్నీలియోన్‌లా ఎందుకు మారాలనుకుంటుందో వివరిస్తుంది. వర్మ యాంగిల్లో ఇది కరెక్టే అయినా..
సభ్యసమాజం అంగీకరించని రీతిలో ఈ షార్ట్ ఫిల్మ్ ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ షార్ట్ ఫిల్మ్‌లో ఏముందో తెలుసుకోవడానికి వీడియో చూడండి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







