ఇరాక్‌లోని చీకటి గదిలో ఒకరి తర్వాత ఒకరు.. 3వేల మంది కి నరకం చూపించారు: నదియా మురాద్
- June 03, 2017
ఐఎస్ ఉగ్రవాదుల చెర అనేకమంది మహిళలు బందీలుగా ఉన్నారు. మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు సెక్స్ బానిసలుగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో తాను బందీగా ఐఎస్ ఉగ్రవాదులకు పట్టబడిన ప్రాంతానికి వెళ్లిన మహిళ భావోద్వేగానికి గురైంది. ఆమె ఎవరో కాదు.. ఐఎస్ టెర్రరిస్టుల లైంగిక జీవన విధానాన్ని.. వారు మహిళలకు నరకం చూపించిన విధానాన్ని ప్రపంచానికి తెలిసే చేసిన ఇరాక్ మహిళ నదియా మురాద్. ప్రస్తుతం ఐరాసలో యాజిదీలు, శరణార్థులు, మహిళల హక్కులపై పోరాడే లాయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా నదియా ఇరాక్‌లోని యాజాది గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న దురాగతాన్ని అంతర్జాతీయ మీడియాకు వివరించారు. 2014లో తమ గ్రామాన్ని ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారని.. కొన్ని నిమిషాల్లోనే మగవారిని, ఆడవారిని వేరు చేశారన్నారు. పురుషుల్ని కళ్ల ముందు కాల్చి చంపేశారు. కానీ మహిళల్ని చంపేస్తారనుకుంటే.. ఆ రాక్షసులు ఆ పనిచేయలేదు. తమలోని యువతులను ఇరాక్‌లోని మొసూల్ తీసుకెళ్లి వేలం వేశారని నదియా మురాద తెలిపింది. అప్పటికే వారి చేతుల్లో నలిగిపోయామని.. ఆ తర్వాత సిరియన్లు, యూరోపియన్లు, ఇరాకీయులు వారి కామవాంఛలను తీర్చుకునేందుకు తమను వాడుకున్నారని తెలిపింది.
చీకటి గదుల్లో ఒకరి తరువాత ఒకరుగా తమపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లు. నరకం చూపించే వాళ్లు. ఇలా మూడువేల మందికిపైగా యాజాదీ మహిళలను సెక్స్ బానిసలుగా మార్చేసుకున్నారు. అదృష్టవశాత్తూ 2014 నవంబరులో అక్కడి నుంచి తప్పించుకోగలిగానని యూజాదీ మురార్ కన్నీటి పర్యంతం అయ్యారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







