ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరుబాట.. భారీ బహిరంగ సభ గుంటూరులో
- June 04, 2017
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ పోరుబాటపట్టింది. ప్రత్యేక హోదా భరోసా పేరుతో గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జేడీయూ అధినేత శరద్‌యాదవ్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, రాజాలు హాజరవుతున్నారు. గుంటూరు ఆంధ్రా-ముస్లిం కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ సభ జరగనుంది. రాహుల్ ప్రత్యేక విమానంలోమధ్యాహ్నం మూడుగంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటల 30 నిమిషాలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 5గంటల 15 నిమిషాలకు గుంటూరు చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 7గంటల 30 నిమిషాల వరకు సభలో పాల్గొంటారు. తర్వాత కొద్దిసేపు కాంగ్రస్ నేతలతో సమావేశమై తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తయ్యాయి. జాతీయ నేతలు వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







