హైదరాబాద్‌లో 8న స్టూడెంట్ వీసా డే
- June 05, 2017
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించగోరే విద్యార్థులకోసం హైదరాబాద్‌లోని అమెరికన్ దౌత్య కార్యాలయం ఈ నెల 8న ప్రత్యేకంగా వీసా డే నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌ను, ప్రతిభావంతులైన విద్యార్థులను అమెరికా ప్రోత్సహిస్తోందని, ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. స్టూడెంట్ వీసాలకు డిమాండ్ పెరిగిపోతోంది. వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి తగిన సమాచారం తెలియక గందరగోళంలో పడుతున్నారు. అమెరికాలోని ఎడ్యుకేషన్ గురించి, ప్రయాణ సమాచారం గురించి వారు తెలుసుకోవలసి ఉంది. అందువల్లే ప్రత్యేకంగా ఈ స్టూడెంట్ వీసా డే నిర్వహిస్తున్నాం అని దౌత్య కార్యాలయ అధికారులు తెలిపారు.
ఆ రోజున విద్యార్థులు తమ సహచర విద్యార్థులతో ఇంటరాక్ట్ కావచ్చునని, వారు అడిగే ప్రశ్నలకు అధికారులు సమాధానాలిస్తారని ఈ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి హాజరు కాలేనివారు కాన్సులేట్ ఫేస్బుక్ పేజ్‌లో సమాచారం తెలుసుకోవచ్చునని అంటున్నారు. వీసా అప్లికెంట్లకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని యూఎస్ ఎంబసీ స్టాఫ్, ఎడ్యుకేషన్ యూఎస్ సెంటర్ ప్రతినిధులు అందజేస్తారన్నారు. అమెరికాలో ఎఫ్, జే, ఎం వీసాల కోసం దరఖాస్తు చేసుకునే స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించు కోవచ్చునని కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







