ఆర్ ఎ ఎఫ్ బృందం నిర్వహణలో 32 మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు
- June 05, 2017
షేక్ థానీ బిన్ అబ్దుల్లా ఫౌండేషన్ మానవీయ సేవల నుండి వైద్య బృందం కజాఖ్స్తాన్ రాజధాని అస్తానాలో 32 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలను నిర్వహించింది. హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఆరోగ్య సేవలను అందించడానికి ఆర్ ఎ ఎఫ్ యొక్క "అల్ ఖుల్బ్ అల్ సఘైరా" (చిన్ని హృదయాలు ) పేరిట ఈ ప్రాజెక్ట్ కొనసాగింది. వైద్య బృందం మే 13 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు కజాఖ్స్తాన్లో శస్త్రచికిత్స పూర్తి చేయడానికి 11 రోజుల సమయం పట్టింది. అస్తనాలోని నేషనల్ సైంటిఫిక్ మెడికల్ సెంటర్లో చిల్డ్రన్స్ హార్ట్ సర్జరీ హాస్పిటల్లో ఈ గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించబడింది. లబ్ధిదారుల జీవితాలను కాపాడటానికి విరాళాల ద్వారా కతర్లో ప్రజలు 450,000 కతర్ రియాళ్ళ ప్రాజెక్టు వ్యయంకు ఆ నిధులు సమకూర్చారు. శస్త్రచికిత్స, ఎండోస్కోపీ, అనస్థీషియా మరియు ఇంటెన్సివ్ కేర్లో 20 మంది నిపుణులతో కూడిన ఆర్ ఎ ఎఫ్ వైద్య బృందం మొత్తం 12 ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సలు మరియు 20 కార్డియాటిక్ కాథెటరిసేషన్లతో సహా మొత్తం 32 కార్యకలాపాలను నిర్వహించింది.అదనంగా ,కజాఖ్స్తాన్ నుండి సుమారు 40 మంది వైద్య సిబ్బంది ఆచరణాత్మక అనుభవాన్ని పొందటానికి సందర్శన వైద్య బృందంతో పరస్పరం సంప్రదించడానికి అవకాశాన్ని పొందారు. ఈ ప్రణాళిక కజాఖ్స్తాన్లో ఆర్ ఎ ఎఫ్ యొక్క స్థానిక భాగస్వామి అల్ బరాకా ఫౌండేషన్తో సహకారంతో అమలు చేయబడింది."దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని పిల్లల సమస్యలను మేము సేకరించామని" అల్ బరాకా ఫౌండేషన్ డైరెక్టర్ బాగ్దాష్ చెప్పారు. ఈ శస్త్రచికిత్సలు నాలుగు రోజుల వయస్సు నుంచి 13 సంవత్సరాల వయసున్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు జరిపేరు. నేషనల్ సైంటిఫిక్ మెడికల్ సెంటర్ పిల్లల హార్ట్ సర్జరీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ షహ్రత్ మార్సాలోవ్ మాట్లాడుతూ, మొదటి సారి ఇటువంటి వైద్య పథకం అమలు చేయబడినదని అన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







