బహిరంగ ప్రదేశాల పని స్థలాల్లో వేసవి పని గంటలు
- June 05, 2017
కతర్: వేసవిలో బహిరంగ ప్రదేశాల పని స్థలాల్లో పని గంటల అమలను జూన్ 15 వ తేదీ నుంచి ఆగస్టు 31 వ తేదీ మధ్య కాలంలో అమలులోకి వస్తుందని కార్మిక మరియు సామాజిక వ్యవహారాల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటించింది. మంత్రివర్గ నిర్ణయం అమలు సంఖ్య (16) 2007 లో పని గంటలను నిర్ణయిస్తుంది సూర్యుడు లేదా బహిరంగ ప్రదేశాలలో పనిచేసి కార్మికులు ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నిలిపివేయాలని నిర్ణయించింది. నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగుల పని గంటలు సమయ వేళలను ఏర్పాటు చేయాలి. కార్మికుల అందరికి ఒక కనిపించే ప్రదేశంలో ఉంచాలి. తద్వారా లేబర్ ఇన్స్పెక్టర్లను వారి తనిఖీ సందర్శనల సమయంలో ఈ టైం టేబుల్ ను సులభంగా గమనించేవిధంగా ఏర్పాటుచేయాలి. తాము తీసుకొన్న నిర్ణయ నిబంధనలను గౌరవిస్తామని ఆయా సంస్థల యజమానులకు మంత్రిత్వ శాఖకు తెలియచేయాలని పిలుపునిచ్చింది. విడుదలైన ఆజ్ఞను ఉల్లంఘించిన ఏ కంపెనీ నైనా ఒక నెల వ్యవధిలో మూసివేస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







