రెండు తెలుగు రాష్ట్రాలలో 8, 9 తేదీల్లో భారీ వర్షాలు
- June 05, 2017
నైరుతి రుతుపవనాలు ఈనెల 8 తరవాత తెలంగాణను తాకే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. 8, 9 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, వీటికి రుతుపవనాల రాకనే కారణమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గత వారం రోజులుగా కేరళ రాష్ట్రంలోనే ఆగిన రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. రాబోయే 3, 4 రోజుల్లో అవి కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ వరకూ వచ్చే అవకాశాలున్నాయని ఆమె వివరించారు. ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి తెలంగాణ వరకూ ఉపరితల ఆవర్తనముంది. దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వీటివల్ల పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. ఇంకా తగ్గుతాయని అంచనా. నైరుతి రుతుపవనాలు ఈనెల 5 కల్లా తెలంగాణకు వస్తాయని తొలుత వాతావరణశాఖ వేసిన అంచనా ఇప్పుడు తప్పింది.
ఈనెల 8లోపు వచ్చే అవకాశాలు లేవు. గతేడాది జూన్ 17న తెలంగాణకు రుతుపవనాలు వచ్చాయి. ఈసారి వేచి చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చని నాగరత్న వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







