జూన్ 30 నుంచి నిలిచి పొన్నున్న కొన్ని ఫోన్స్ లో వాట్సప్ సేవలు బంద్
- June 05, 2017
ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక సాధనం... ప్రపచంలో ఎక్కడ ఏమూల ఉన్నా బంధుత్వలను, స్నేహాన్ని క్షణాల్లో కలుపుతున్న సాధనం వాట్సప్. అవును వాట్సప్ వాడుకలోకి వచ్చాక.. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి వాడకానికి ప్రజాదరణ తగ్గింది అన్న విషయం విధితమే... ప్రస్తుతం మనిషికి తిండి,బట్ట,నీరు వంటివి ఎలా నిత్యవసర వస్తువులో... వాట్సప్ కూడా నిత్యవసర సాధనంగా మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోజు రోజుకీ వాట్సప్ సరికొత్త ఫీచర్స్ తో అప్ డేట్ అవుతూ మరింతగా వినియోగదారులను ఆకర్షిస్తోంది.. తమతో నిత్యం బంధువులు, స్నేహితులు టచ్ లో ఉండేటట్లు చేసిన ఈ వాట్సప్ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోతే... ఈ ఆలోచనే అసలు బాగుండలేదు కదా... కానీ కొంత మంది వినియోగదారులకు ఈ వాట్సప్ అందుబాటులో ఉండదు... ఈ విషయం పై లాస్ట్ ఇయర్ కంపెనీ ఒక అధికారిక ప్రకటన చేసింది.. తమ వాట్సప్ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొన్ని మొబైల్స్ లో వాట్సప్ పనిచెయ్యదని ఈ నిర్ణయం 2016 ఏడాది చివర్లో అమలులోకి రానున్నదని తెలిపింది.. కానీ ఆ సమయంలో కొంతమంది వ్యక్తం చేసిన అభ్యంతరాలతో.. ఆ నిర్ణయాన్ని ఈ ఏడాది జూన్ 30 వరకు వాయిదా వేసింది.. కాగా ఈ సారి వాట్సప్ కొన్ని సెల్ ఫోన్స్ లో బంద్ నిర్ణయం కచ్చితంగా అమలు చేయనున్నట్లు కంపెనీ పేర్కొన్నది. దీంతో చాలమంది మొబైల్స్ కు వాట్సప్ సపోర్ట్ చేయదట..
వాట్సప్ సపోర్ట్ చెయ్యని ఫోన్స్ ....బ్లాక్ బెర్రీ (బ్లాక్ బెర్రీ 10 సహా), నోకియా ఎస్ 40 , నోకియా సింబియన్ ఎస్ 60, ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2, విండోస్ 7.1, ఐఫోన్ 3జీస్ ఐవోఎస్ 6.. ఈ ఫోన్లలో సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేసుకొని సేవలు పొందవచ్చు అని కంపెనీ గతంలోనే తెలిపింది.. కాగా విండోస్ యూజర్లకు చాట్‌డాటాను ఆర్గనైజ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఈ ఫీచర్ ఉంటే.. ఫొటోలు, జిప్‌లు, వీడియోలు, మెసేజ్‌లు యూజర్లు తమకు నచ్చినట్టు ఒకేచోట ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం వాట్సప్ లేకుండా ప్రపంచం ఒక్కక్షణం కూడా మనలేదన్నది పచ్చినిజం.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







