అమెరికా ఒర్లాండోలో దుండగుడు కాల్పులు.. ఆరుగురు మృతి
- June 05, 2017
కాల్పుల మోతతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో ఓ మహిళ సహా అరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఒర్లాండో పట్టణంలోని హ్యాంగింగ్ మాస్రోడ్డులోని ఒక పారిశ్రామికవాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఘటనాస్థలిలోనే నలుగురు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. అనంతరం కాల్పులకు తెగబడిన వ్యక్తి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వెనుక కారణాలు స్పష్టంగా తెలియదు.
దుండగుడు అక్కడే పనిచేసిన 45 ఏళ్ల మాజీ ఉద్యోగి అని అధికారులు తెలిపారు. కాల్పుల నుంచి ఏడుగురు సురక్షితంగా తప్పించుకున్నారని పేర్కొన్నారు. హుటాహుటిన ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారితో కలిసి ఎఫ్బీఐ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







