ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో వాట్సప్ షెడ్యూలర్ గురించి తెలుసా
- June 07, 2017
వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను అనుకున్న సమయానికి పంపేందుకు వీలుగా గూగుల్ ప్లే స్టోర్‌లో షెడ్యూలర్ అనే ఆప్షన్ వచ్చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి షెడ్యూలర్ ఫర్ వాట్సప్‌ను, షెడ్యూలర్ నో రూట్ అని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు కోరుకునే సమయంలో ఫోటోలను, వీడియోలను మెసేజ్‌లను పంపే వీలుంటుంది. ప్రస్తుతం వాట్సాప్‌ను అందరూ తెగ వాడేస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి చెందిన వ్యక్తులు, స్నేహితులు ఎక్కడున్నా.. వాట్సాప్ స్టేటస్ ద్వారా.. మెసేజ్ ద్వారా ఫోటోలు, వీడియోల అప్‌డేషన్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే ఓ ప్రత్యేక సమయంలో అంటే పుట్టిన రోజు సందర్భంగా సదరు వ్యక్తికి అర్థరాత్రి 12 గంటలకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వాట్సాప్ షెడ్యూలర్ ద్వారా చేసుకోవచ్చు. వాట్సాప్ షెడ్యూలర్ ద్వారా కోరుకునే సమయానికి మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు అప్ చేసే సౌలభ్యం వుంటుంది. వాట్సప్ మెసేజ్‌లను షెడ్యూలు చేసేందుకు షెడ్యూలర్ ఫర్ వాట్సప్‌ను, క్లిక్ చేసి.. వాట్సాప్ గ్రూప్ లేదా కాంటాక్టులను ఎంపిక చేయాలి. ఆపై మెసేజ్ పంపాల్సిన తేదీని, సమయాన్ని క్లిక్ చేయాలి.
ఇలా క్రియేట్ చేసిన మెసేజ్ షెడ్యూల్ చేయబడుతుంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







