సౌదీ రాజుకి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఫోన్
- June 07, 2017
ఖతార్‌లో గల్ఫ్ దేశాలు సంబంధాలను తెంచుకోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సౌదీ రాజు సల్మాన్ అమిద్‌కు ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరుకు గల్ఫ్ దేశాలు ఐక్యమవాలని ఆయన కోరారు. ఉగ్రవాద సంస్థలను ఆర్థికంగా దెబ్బతీయడం తదితర కీలకమైన విషయాల గురించి ఇరు నేతలు చర్చించినట్లు శ్వేతసౌధం వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఖతార్ విషయం తెలిసిన వెంటనే ట్విటర్ ద్వారా స్పందించిన ట్రంప్ ‘నా పశ్చిమాసియా పర్యటన ఫలించింది. అతివాద భావజాలానికి ఏ రకంగాను ఆర్థిక సాయం చేయకూడదని నా పర్యటనలో చెప్పాను, నేతలు ఖతార్‌ను ఎంచుకున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ఇదే తొలి అడుగు కావచ్చు’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
తీవ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు అండగా నిలుస్తుందని ఖతార్‌తో సౌదీఅరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మరికొన్ని దేశాలు సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. అయితే గల్ఫ్ దేశాలు చేస్తున్న ఆరోపణలను ఖతార్ తీవ్రంగా ఖండిస్తోంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







