ఖతార్‌పై సింపతీ చూపితే కఠిన చర్యలు
- June 07, 2017
యూఏఈ: సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో ఖతార్‌పై సింపతీ చూపినట్లయితే కఠిన చర్యలకు గురవుతారని యూఏఈ అటార్నీ జనరల్ హెచ్చరించారు. డాక్టర్ హమాద్ సైఫ్ అల్ షమ్షి మాట్లాడుతూ, ఖతార్ విషయంలో యూఏఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందనీ, యూఏఈ ఇతర జిసిసి అలాగే అరబ్ నేషన్స్ పట్ల ఖతార్ అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరంగా ఉండటం వల్లే కఠిన నిర్ణయాలు తప్పలేదని చెప్పారు. యూఏఈ నేషనల్ సెక్యూరిటీని కాపాడేందుకోసం తీసుకున్న కఠిన చర్యల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన సూచించారు. ఖతార్‌పై ఏ రూపంలో సానుభూతి తెలిపినా చట్టపరమైన చర్యలను కొనితెచ్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికల్ని బేఖాతరు చేసేవారికి 3 నుంచి 15 ఏళ్ళ జైలు శిక్ష, 500,000 తక్కువ కాకుండా జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







