ఇరాన్ చెర నుంచి 15 మంది భారతీయ మత్స్యకారులకు విముక్తి
- June 08, 2017
పదిహేనుమంది భారతీయ మత్స్యకారులు, షార్జా నుంచి ఇరానియన్ సముద్ర జలాల్లోకి వెళ్ళి, అక్కడే అరెస్టయ్యారు. ఆరు నెలల తర్వాత వారికి ఉపశమనం కల్గింది. వారంతా స్వదేశానికి తరలి వెళ్ళనున్నారు. ఇండియన్ కన్స్యూలేట్, వారిని స్వదేశానికి పంపేందుకు మార్గం సుగమం చేసింది.యూఏఈలోని భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, డిసెంబర్ 2016లో ఫిషర్‌మెన్ అరెస్ట్ వ్యవహారం వెలుగు చూశాక, బందర్ అబ్బాస్‌లోని కాన్సులేట్‌తో సంప్రదించి, పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు ప్రయత్నించామన్నారు. తమ చర్యలు ఫలించి మే 28న వారంతా విడుదలయ్యారనీ, వారిని స్వదేశానికి రప్పించేందుకుగాను నిధుల్ని వివిధ మార్గాల్లో సమీకరించామని తెలిపారాయన. ఈ వ్యవహారంలో మీడియేట్ చేసిన గిరీష్ పంత్ అనే వాలంటరీ సోషల్ వర్కర్ మాట్లాడుతూ, తమవంతుగా మత్స్యకారులకు సహాయ సహకారాలు అందించామని చెప్పారు. బాల మురుగన్ అనే మత్స్యకారుడు మాట్లాడుతూ, నాలుగేళ్ళుగా షార్జాలో ఫిషర్‌మెన్‌గా పనిచేస్తున్నాననీ, అనుకోకుండా కిష్ ఐలాండ్స్ సమీపంలోకి వెళ్ళడంతో ఇరానియన్ కోస్ట్‌గార్డ్ తమను అరెస్ట్ చేసి, ఆరు నెలలపాటు జైల్లో ఉంచిందన్నారు. ఆరు నెలలపాటు తమకు సరైన తిండి లేకుండా పోయిందని వాపోయాడు. ఆరు నెలలుగా జీతం లేకపోవడంతో తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొందని మరో మత్స్యకారుడు చెప్పారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







