పొట్ట తగ్గి అధిక క్రొవ్వు కరిగించడం చాలా ఈజీ... ఎలాగంటే
- June 08, 2017
మన శరీరం ఉండాల్సిన దాని కన్నా అధికబరువు ఉంటే అప్పుడు మనకు కలిగే ఇబ్బందులు ఏంటో అందరికీ తెలుసు. దీనికితోడు పొట్ట ఎక్కువగా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే ఒక సింపుల్ ఎక్సర్సైజ్ను రోజూ నాలుగు నిమిషాల పాటు చేస్తే 28 రోజుల్లోనే శరీరంలో ఉన్న అధిక కొవ్వు తగ్గిపోతుంది. అంతేకాదు పొట్ట కూడా తగ్గి నాజూగ్గా తయారవ్వడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు.
నేలపై బోర్లాపడుకుని మోచేతులను కాలివేళ్ళను ఆధారంగా చేసుకుని శరీరం మొత్తాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. దీంతో పొట్ట, ఛాతి కండరాలు, భుజాలపై అధిక ఒత్తిడి పడుతుంది. ఇది ఆయా భాగాల్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. మొదటి రెండురోజులు 20 సెకండ్లు, మూడు, నాలుగవరోజు 30 సెకండ్లు, ఐదవరోజు 40 సెకండ్లు, ఆరవరోజు రెస్టు తీసుకోవాలి. ఏడు, ఎనిమిది 45 సెకండ్లు, 9,10,11వతేదీల్లో 60 సెకండ్లు, 12వరోజు 90సెకండ్లు, 13వరోజు రెస్ట్ తీసుకోవాలి.
అలాగే 14,15వ రోజుల్లో 90సెకండ్లు, 16,17రోజుల్లో 120 సెకండ్లు, 18వరోజు 150 సెకండ్లు, 19వతేదీ రెస్ట్ తీసుకోవాలి. 20,21రోజుల్లో 150 సెకండ్లు, 22,23రోజుల్లో 180 సెకండ్లు, 24వ రోజులో 210 సెకండ్, 25న రెస్ట్ తీసుకోవాలి. 26వ రోజున 210 సెకండ్లు, 27,28రోజుల్లో 240సెకండ్లు చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తే ఎక్సర్సైజ్ చేస్తే ఫలితం ఉంటుంది. పొట్ట కరగడమే కాదు..క్రొవ్వు కూడా కరుగుతుందంటున్నారు వైద్యులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







