ఆలూ కొత్తిమీర రైస్
- June 08, 2017
కావాల్సిన పదార్థాలు: బియ్యం- ఒక కిలో, బంగాళదుంపలు- అరకిలో, కొత్తిమీర-రెండు కట్టలు, పచ్చిమిర్చి-100గ్రా, ఉప్పు-తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా అన్నం వండుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలను చెక్కుతీసి చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి. కొత్తిమీరను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి దాంట్లో పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసుకుని నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టుకుని అందులో సరిపడా నూనె వేసుకోవాలి. బాగా కాగాక తరిగిపెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఐదునిమిషాలపాటు దోరగా వేగించుకోవాలి. తర్వాత రుబ్బిపెట్టుకున్న కొత్తిమీర పేస్టుని కూడా వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని ఆ అన్నంలో పై మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. నూనెలో ఎర్రగా వేగించిన బంగాళదుంప చక్రాల్ని అలంకరణ కోసం అన్నంపై పెట్టాలి. దీన్ని ఉల్లిచట్నీ లేదా టమోటాపెరుగు పచ్చడితో తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







