ఉగ్రవాదంపై ఐక్య పోరాటం నరేంద్ర మోదీ గళం విప్పనున్నారు
- June 08, 2017
కజకిస్తాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచానికి పెనుసవాలుగా మారిన ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గళం విప్పనున్నారు. వివిధ దేశాల్లో వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరాటానికి పటిష్టమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరాన్ని ఆయన గట్టిగా వినిపించనున్నారు. ఎంతో కాలంగా భారత్, పాకిస్తాన్‌లు ఎదురుచూస్తున్న ఎస్సీఓ శాశ్వత సభ్యత్వానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. 2001లో ఎస్సీఓ ఏర్పడిన తరువాత తొలిసారిగా విస్తరిస్తుండటం విశేషం.
చైనా, రష్యా తదితర ప్రధాన మధ్య ఆసియా దేశాధినేతలు పాల్గొంటున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మోదీ గురువారం అస్తానా చేరుకున్నారు. ఆయన రెండు రోజులు ఇక్కడ పర్యటిస్తారు. ఆర్థిక, అనుసంధాన అంశాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సహకారంపై ముందడుగు వేసేందుకు ఎస్సీఓ సమావేశం కీలకం కానుందని అస్తానా బయలుదేరేముందు మోదీ పేర్కొన్నారు. చైనా ఆధిపత్యం సాగుతున్న ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు, వాణిజ్య లావాదేవీల్లో భారత్‌కు మైలురాయిగా నిలుస్తుంది. భారత్, పాక్‌ల సభ్యత్వం... ఈ ప్రాంతాల్లో సవాళ్లను అధిగమించడానికి, వాణిజ్య, పెట్టుబడుల ప్రోత్సాహానికి దోహదపడుతుందని ఎస్సీఓ సెక్రటరీ జనరల్ రషీద్ అలిమోవ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







