నకిలీ డిటర్జెంట్ ఫ్యాక్టరీ మూసివేత తర్వాత 10 మందికి జైలు శిక్ష
- June 09, 2017
అనుమతి లేని అక్రమ కర్మాగారాలలో నకిలీ డిటర్జెంట్లను తయారుచేసిన నేరంలో దోషులుగా నిర్ధారించిన తరువాత10 మంది నిందితులకు ఒకొక్కరికి 90 నెలల జైలుశిక్ష విధిస్తూ రియాద్ లోని క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాక ప్రతి నిందితుడు ఆరు నుంచి 18 నెలల మధ్య జైలుశిక్షను మరియు 100,000 సౌదీ రియాళ్లను ( 26,700 డాలర్లను) జరిమానా సౌదీ అరేబియా వాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ విధించింది.ఒక సౌదీ దేశీయుడు, ఇద్దరు సిరియన్లు, ఇద్దరు ఇథియోపియన్లు మరియు ఐదుగురు ఇథియోపియన్ మహిళలతో ఈ ముఠా రూపొందించబడింది.10 ఏళ్ళ జైలుశిక్ష పూర్తి చేసిన అనంతరం 9 మంది విదేశీ నేరస్తులను దేశ బహిష్కరణ చేయనున్నారు. ఈ పది మంది నేరస్థులను నకిలీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, నకిలీ డిటర్జెంట్లను ఉత్పత్తి చేయడమే కాక నకిలీ ట్రేడ్మార్క్లను ఉపయోగించారు. వినియోగదారులను రక్షించడానికి, వాణిజ్య వ్యతిరేక మోసం చట్టాలు మరియు ట్రేడ్మార్క్ వ్యవస్థ యొక్క దుర్వినియోగం తదితర ఉల్లంఘనను నివారించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను అడ్డుకొంటామని సౌదీ అరేబియావాణిజ్య మరియు పెట్టుబడుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే, వినియోగదారుల ఆరోగ్య భద్రతకు హాని కలిగించి వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నించే ఉల్లంఘనకారులకు వ్యతిరేకంగా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఈ ప్రకటన తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







