మేము ఖతార్ కి సపోర్ట్ చేస్తాం: టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్
- June 10, 2017
ఉగ్రవాదానికి ఆర్థికంగా అండదండలు అందిస్తున్న ఆరోపణలతో ఖతార్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఖతార్‌పై ఆంక్షల విషయంలో స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. చాలా సంవత్సరాలుగా ఖతార్ ఉగ్రవాదాన్ని ప్రపంచంపైకి ఎగదోస్తుందని.. అరబ్ దేశాలు ఖతార్‌పై ఎప్పుడో నిషేధం విధించాల్సిందని అభిప్రాయపడ్డారు. తన పర్యటనలో సౌదీ ప్రభుత్వంతో ఈ విషయాన్ని చర్చించానని, ఇప్పటికైనా ఖతార్‌పై నిషేధం విధించడం ఆనందకరమైన విషయమన్నారు.
ఇదిలా ఉంటే .. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మాత్రం ఖతార్‌కు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. అక్కడి ప్రజలకు అవసరమైన నిత్యావరసర సరుకులను ఎగుమతి చేస్తామని తెలిపారు. ఖతార్‌పై విధించిన ఆంక్షలపై సౌదీ అరేబియా పునరాలోచించాలని ఆయన కోరారు. ఇస్తాంబుల్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రేయిన్, ఈజిప్టు తదితర అరబ్ దేశాలు ఖతార్‌పై ఆంక్షలు విధించాయి.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







