ఇక పాన్ మరియు ఐటి రిటర్న్స్ కు ఆధార్ తప్పనిసరి
- June 10, 2017
ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆధార్ తప్పనిసరని స్పష్టంచేసింది ప్రత్యక్షపన్నుల బోర్డు. జులై ఒకటి నుంచి సమర్పించే పన్ను రిటర్న్స్‌కు కచ్చితంగా ఆధార్ కావాల్సిందేనని పేర్కొంది. వచ్చేనెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. జూలై ఒకటి నాటికి పాన్ పొందినవారు, ఆధార్ ఉన్నవారు, అదేవిధంగా ఆధార్ పొందే అర్హత గలవారు తప్పనిసరిగా ఆధార్‌ను పన్ను శాఖ అధికారులకు తెలపాలని స్పష్టంచేసింది. పాన్, ఆధార్‌లను అనుసంధానం చేసేందుకు ఈ వివరాలను సమర్పించాలని వెల్లడించింది.
మరోవైపు పాన్‌తో ఆధార్ సంఖ్య అనుసంధానం తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఆధార్ లేనివారికి ప్రస్తుతానికి ఈ నిబంధనను వర్తింప
చేయకూడదని పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆధార్ సంఖ్య ఉన్నవారంతా తప్పనిసరిగా దానిని పాన్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ కోసం దరఖాస్తు చేసి, నెంబర్ రాని వారు దీనినుంచి మినహాయింపు ఇచ్చింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







