అమృత్ సరి చేప
- June 10, 2017
కావాల్సిన పదార్థాలు
చేప - 300 గ్రాములు, అల్లం వెల్లులి పేస్ట్ - ఒక టీస్పూన్, వాము - పావు టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కారం - ముప్పావు టీస్పూన్, కసూరి మెంతి - అర టీస్పూన్, తందూరీ మసాలా - ముప్పావు టీస్పూన్, బిర్యానీ మసాలా - పావు టీస్పూన్ (అవసరమనుకుంటే), ఆమ్‌చూర్ - చిటికెడు, నిమ్మరసం - ఒక టీస్పూన్, శెనగపిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - కొద్దిగా, నూనె - రెండు టేబుల్ స్పూన్లు (ఆవనూనె అయితే రుచి బాగా వస్తుంది)
తయారీ విధానం:
శెనగపిండిని నూనె లేకుండా పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. పిండి రంగు మారకుండా జాగ్రత్తపడాలి.
చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి నచ్చిన సైజ్‌లో కోయాలి.
ఈ ముక్కలకి వాము, శెనగపిండి, నూనె తప్పించి మిగతా అన్ని పదార్థాలను పట్టించాలి.
వెడల్పాటి పాన్‌లో నూనె వేడిచేయాలి. అందులో వాము వేసి అది చిటపటమనేవరకు ఉంచాలి. ఇందులో నానబెట్టిన చేపముక్కలు వేసి ఓ మాదిరి మంట మీద నాలుగు నిమిషాలు ఉంచాలి. తరువాత రెండో వైపు తిప్పి మరో ఐదు నిమిషాలు వేగించాలి.
ముక్కల మీద ఒకవైపు మాత్రం శెనగపిండి చల్లాలి. వేగించేటప్పుడు పిండి మాడిపోకుండా జాగ్రత్తపడాలి.
ముక్కల్ని రెండోవైపు తిప్పి మళ్లీ వేగించాలి. ఒకవైపు చల్లిన శెనగపిండే రెండు వైపులకు సరిపోతుంది. అవసరమనుకుంటే మంట కాస్త పెంచుకోవచ్చు. ముక్క సరిగా ఉడికేలా వేగించాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







