విలువిద్యలో ప్రపంచ రికార్డు దిశగా చిన్నారి డాలీ శివాని
- June 10, 2017
రికార్డుల దిశగా పయనిస్తున్న చిన్నారి చెరుకూరి డాలీ శివాని (5) శనివారం మరో అడుగు ముందుకేసింది. విజయవాడలోని వీఎంసీ ఓల్గా ఆర్చరీ అకాడమీలో శనివారం రాష్ట్ర విలువిద్య సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు ప్రయత్నంలో డాలీ శివాని 15 నిమిషాల వ్యవధిలో వంద బాణాలను సంధించే లక్ష్యంగా దిశగా ప్రదర్శన చేసింది. అయితే 15 నిమిషాల నాలుగు సెకన్లలో 95 బాణాలను మాత్రమే సంధించగలిగింది. ఆ 95 బాణాలు లక్ష్యంపై ఉన్న 5 పాయింట్ల నుంచి 10 పాయింట్లలో సంధించినవే కావడం విశేషం. అనంతరం రాష్ట్ర విలువిద్య సంఘం కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు కోసం రోజూ అరగంట సేపు డాలీ సాధన చేస్తోందని తెలిపారు. వచ్చే నెల మూడో వారంలో సంబంధిత అధికారుల సమక్షంలో ప్రపంచ రికార్డు ప్రదర్శన చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న శివాని ఈ ఏడాది ఏప్రిల్ 15న ‘కైజలా యాప్’ ద్వారా 2024లో జరిగే ఒలింపిక్స్‌లో ఆర్చరీలో పతకం సాధించేందుకు తగు సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞాపన పత్రం అందించిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







