గిన్నిస్ లో స్థానం పొందిన ఇఫ్తార్ విందు
- June 11, 2017
ముస్లిం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా లెబనాన్ రాజధాని బీరుట్లో అతిపెద్ద ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఏక కాలంలో దాదాపు 5400 మంది ముస్లింలు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా స్థానికులు, అనాధలు, శరణార్థులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. విందు కార్యక్రమానికి ముందు కళాకారులు ప్రదర్శించిన లెబనాన్ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. లెబనాన్‌కు చెందిన అజిలోనా స్వచ్ఛంద సంస్థ రంజాన్ మాసం సందర్భంగా ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఏక కాలంలో అత్యధిక సంఖ్యలో ఒకే చోట ఇఫ్తార్ విందు నిర్వహించిన సంస్థగా అజిలోనా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకెక్కింది. విందు ముగిసాక గిన్నిస్ రికార్డు అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని సంస్థ అధ్యక్షురాలికి అందించారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







