ఖతార్ కు ఆహారం పంపిణీ చేస్తున్న ఇరాన్
- June 11, 2017
టెహ్రాన్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఖతార్‌తో గల్ఫ్దేశాలు సంబంధాలు తెంచుకోవడం వల్ల అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. గల్ఫ్‌దేశాల నుంచి ఖతార్ ఎక్కువగా ఆహారపదార్థాలను దిగుమతి చేసుకునేది. కానీ ఆయా దేశాలు ఖతార్‌తో రవాణా సంబంధాలు తెంచుకోవడం వల్ల ఆహారం కొరత ఏర్పడింది. దీనిపై ఇరాన్ స్పందించి ఆహారాన్ని సరఫరా చేసింది. ఐదు విమానాల్లో ఖతార్‌కు ఆహార పదార్థాలు పంపించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ‘పండ్లు, కూరగాయలతో పాటు తినే ఆహారపదార్థాలను ఐదు విమానాల్లో పంపించాం. ఒక్కో విమానంలో దాదాపు 90టన్నుల ఆహారపదార్థాలను పంపించినట్లు’ ఇరాన్ వైమానిక దళ ప్రతినిధి షహ్రోక్ నౌషాబది తెలిపారు.
ఖతార్‌కు ఇంకా అవసరమైతే పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. విమానాలతో పాటు మూడు పెద్ద ఓడల్లో 350 టన్నుల ఆహారాన్ని ఇరానియన్ పోర్టు ఉంచి ఖతార్‌కు పంపించారు. ఉగ్రవాదానికి నిధులు ఇస్తూ ప్రోత్సహిస్తుందని ఖతార్‌తో సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, యెమెన్ దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







