యు.ఏ.ఈ లో 'జయదేవ్' సినిమా పోస్టర్ విడుదల
- June 11, 2017
యు.ఏ.ఈ: ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఘంటా శ్రీనివాస్ తనయుడు ఘంటా రవితేజ సినీ రంగంపై గల ఆసక్తితో తన సినీ ప్రస్థానాన్ని'జయదేవ్' అనే చిత్రంతో వెండితెరపై కనువిందు చేయనున్నారు. ఈ చిత్రం పోస్టర్ ను యు.ఏ.ఈ లో మన తెలుగు వారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి యు.ఏ.ఈ లోని డా.ముక్కు తులసి కుమార్(ఏ.పి.ఎన్.ఆర్.టి కో-ఆర్డినేటర్),ప్రిన్స్(ఏ.యస్.పి మ్యానేజింగ్ డైరెక్టర్), శ్రీకాంత్ చిత్తర్వు(మాగల్ఫ్ అధినేత) తులసి ప్రసాద్(మజూన్ మ్యానేజింగ్ డైరెక్టర్), సింగిరి రవి కుమార్(చార్టర్డ్ అకౌంటెంట్), అప్పాజీ, సుధీర్, హరిబాబు, ప్రసాద్ పేడిశెట్టి, రాజముండ్రి మూర్తి, యోగి బాబు, సుధాకర్, ప్రవీణ్ కుమార్, ఆరిఫ్ బాషా, మహమ్మద్ గౌస్,జస్మిర్, నజీబ్ అబ్దుల్లాహ్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం రమదాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, టక్కరి దొంగ, ఈశ్వర్, లక్ష్మి నరసింహా వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు జయంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాటాడుతూ "వివిధ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ తో ఘంటా రవి ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా ఘంటా రవి కి ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. మరియు సంగీత మాంత్రికుడు మణిశర్మ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి స్పెషల్ ఆకర్షణ అని చెప్పారు." శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్స్& క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రం విడుదల కానున్నది. ఘంటా రవి కి కథానాయికగా మాళవిక కనువిందు చేయనుంది.

తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







