ముహర్రాక్‌లో బెగ్గింగ్‌ని అరికట్టేందుకు చర్యలు
- June 13, 2017
మనామా: బెగ్గింగ్‌ని బహ్రెయిన్ సొసైటీ నుంచి దూరం చేసే క్రమంలో ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గడచిన కొద్ది వారాల్లో 50 మంది బెగ్గర్స్‌ని తమ టీమ్‌లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మే 1 నుంచి జూన్ 10 వరకు ఈ యాభై మందిని గుర్తించి, కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే బెగ్గింగ్‌ని అరికట్టేందుకోసం సమాజంలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, కమ్యూనిటీ పార్టనర్స్, పౌరులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బెగ్గింగ్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా, హాట్‌లైన్స్‌ని సంప్రదించవచ్చు. బెగ్గర్స్ అలాగే అక్రమ స్ట్రీట్ వెండర్స్‌ని తగ్గించేందుకోసం చేపట్టిన చర్యల్లో ఇది రెండవ భాగమని అధికారులు పేర్కొన్నారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా వేడుకల స్ఫూర్తిని దెబ్బతీసేందుకు మసీదుల వద్ద బిక్షాటన ఇబ్బందికరంగా మారుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







