లండన్‌లోని గ్రీన్‌ఫెల్ టవర్స్‌లో గల ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం
- June 13, 2017
లండన్‌లో భారీ అగ్నిప్రమాదం. 27 అంతస్తుల గ్రీన్‌ఫెల్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. దాదాపు అన్ని అంతస్తుల్లోకి విస్తరించాయి. సుమారు 200 మంది భవనంలో చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే 50 ఫైరింజన్లు మంటలార్పేందుకు స్పాట్‌కు వెళ్లాయి. సుమారు 500 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
లండన్‌లో ఓ భారీ భవనం అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. వెస్ట్ లండన్‌లో ఉన్న ఈ 27 అంతస్తుల భవనంలో మంటలు అంటుకోవడంతో దాదాపు 20 ఫైరింజన్లు, 200 మంది అగ్నిమాపకసిబ్బంది వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది భవనంలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు,. నార్త్ కింగ్ స్టన్లో ఉన్న ఈ భవనంలో చీకటి పడే ముందు మంటలు చెలరేగాయి. మంటల్లో గాయపడ్డ ఇద్దరిని ప్రస్తుతం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మరికొంతమంది పొగకు ఊపిరాడక సమస్యలు ఎదుర్కుంటున్నారు. టవర్ మంటల్లో చిక్కుకున్న దృశ్యాలుసోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి.. జనం భవనం నుంచి దూకేస్తున్నట్టు కూడా కొందరు చెబుతున్నారు. ఈ భవనాన్ని 1970లో నిర్మించినట్టు తెలుస్తోంది.. దీన్ని తాజాగా రీ డెవలప్ మెంట్ కోసం ప్రతిపాదించారు. ఇది నాటింగ్ హిల్ కు సమీపంలో ఉంది.. అండర్ గ్రౌండ్ స్టేషన్‌కు ఇది చాలా దగ్గర్లో ఉంది. పునర్నిర్మించాలని అనుకుంటున్న సమయంలోనే ఇది అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







