కార్మికులకు బకాయిల్ని విడుదల చేసిన కంపెనీ
- June 14, 2017
మనామా: లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ జోక్యంతో, కార్మికులకు కొన్నాళ్ళుగా వేతనాలు బకాయిపడ్డ సంస్థ, ఆ బకాయిల్ని చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ వివాదానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఆదేశించారు. దాంతో మినిస్ట్రీ, సంబంధిత వర్గాలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే సంస్థ, బకాయిల్ని చెల్లించడానికి తగిన నిధుల్ని విడుదల చేసింది. దేశం విడిచి వెళ్ళాలనుకుంటున్న కార్మికులకు సైతం రావాల్సిన పూర్తి వేతనాల్ని సంస్థ చెల్లించనుంది. వారికి మినిస్ట్రీ ఆఫ్ వర్కర్స్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద తగిన సౌకర్యాల్ని కలగజేస్తోంది. వారం రోజుల్లోగా కంపెనీ, ఈ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







