గల్ఫ్ దేశాలు కతర్ ను నిషేధించడంపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండన
- June 14, 2017
కతర్:గల్ఫ్ దేశాలు కతర్ కు పలు విషయాలలో సహకారం అందించే విషయంలో ఏకాకిని చేసి నిషేధించడంపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. కతర్ పై దిగ్బంధం కారణంగా కుటుంబాల మీద ప్రభావం చూపుతున్న అల్లర్లకు సంబంధించి సౌదీ అరేబియా, యుఎఇ మరియు బహ్రెయిన్లతో కూడిన గల్ఫ్ దేశాలు తీసుకున్న చర్యలు అస్పష్టంగా ఉన్నాయని, మానవ హక్కులను హరించడం సరికాదంటూ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, డాక్టర్ అలీ బిన్ స్మాక్ అల్-మర్రి చర్చలు నిర్వహించారు.లండన్ లో జరిగిన ఈ సమావేశంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్, సలీల్ శెట్టి మాట్లాడుతూ, గల్ఫ్ దేశాలు కతర్ పై విధించిన దిగ్బంధ ఫలితాల ప్రభావం పలు సమస్యలు కతర్ ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ ఉల్లంఘనలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించినప్పటికీ, తిరిగి యధాస్థితి కొనసాగింపుపై అన్ని సంబంధిత పార్టీలతోనూ, అంతర్జాతీయ సంస్థలతోనూ చర్చించి కతర్ పై నిషేధం ఎత్తివేయాలని కోరనున్నట్లు ఆయన చెప్పారు. మూడు గల్ఫ్ దేశాలు చేపట్టిన చర్యలు, ముట్టడి ,ప్రతిఘటన మరియు సాధారణ కుటుంబాలపై నిషేధ ప్రభావము కారణంగా ఇబ్బదులు పడుతున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







