నెంబర్ వన్ హీరో బాలకృష్ణ సొంతం
- June 14, 2017
వాహనాల ఫ్యాన్సీ నెంబర్లకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆయా నెంబర్లను దక్కించుకునేందుకు చాలామంది పోటీపడతారు. వాహనాదారుల మోజును తమకు అనుకూలంగా మార్చుకుంటోంది ఆర్టీఏ ఆఫీసు. అందులోనూ 1 నుంచి 9 అంకెల గల సింగల్ డిజిట్ నెంబర్లపై ఎక్కువమంది మోజుపడతారు. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో జరిగిన వేలంలో.. ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహనదారులు పోటీపడ్డారు.ఇక టీఎస్ 09 ఈయూ 0001 నెంబర్ కోసం హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.7.77 లక్షలు వెచ్చించారు. రీసెంట్‌గా ఆయన బర్త్ డేకి కూతుళ్లు కొనిచ్చిన బెంట్లీ కారు కోసం ఈ నెంబర్‌ను వేలంలో గెలుచుకున్నారు. మార్కెట్లో ఈ కారు ధర దాదాపు రూ.3 కోట్లపైనే వుంటుందని చెబుతున్నారు.
టీఎస్ 09 ఈటీ 9999 కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.10.05 లక్షలు చెల్లించాడు. రవి కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన వ్యక్తి బెంజ్ జీఎల్‌ఈ 350 డీ కోసం దీన్ని సొంతం చేసుకున్నాడు. ఈ వాహనం ధర రూ.72.49 లక్షలపైమాటే! అదేవిధంగా ఆర్‌ఎస్ బ్రదర్స్.. టీఎస్ 09 ఈయూ 0099 నెంబర్ కోసం రూ.2.70లక్షలకు వేలంలో దక్కించుకొన్నారు. రూ.62 లక్షల విలువ చేసే ల్యాండ్ రోవర్ కోసం దీన్ని దక్కించుకొన్నారు. మొత్తం మీద బుధవారం జరిగిన వేలం ద్వారా రూ. 30.34 లక్షల ఆదాయం సమకూరింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







